హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని డిమాండ్

విశాఖ ఉక్కునగరం స్మృత్యాంజలి పార్క్ వద్ద స్టీల్ సీఐటీయూ అధ్యక్షులు యు. రామస్వామి చలో ఢిల్లీ గోడపత్రాలను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు. నాలుగు స్టీల్ ప్లాంట్ల ప్రైవేటీకరణ వెనక్కి తీసుకున్నారని, విశాఖది మాత్రమే తీసుకోలేదని విమర్శించారు. లేబర్ కోడ్స్, వేతన సవరణ అమలు చేయడం లేదని ఆరోపించారు.