SS: హిందూపురంలో చికిత్స పొందుతున్న ఊటుకూరు బాలికను బాలల హక్కుల కమిషన్ సభ్యుడు చల్లా మధుసూదన్ రావు శుక్రవారం పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం, మానసిక కౌన్సెలింగ్ అందించాలని అధికారులను ఆదేశించారు. వైద్య నివేదికలు త్వరగా పోలీసులకు అందించాలని సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పరిగి ఎస్సైకి ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బాలికపై దాడి.. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశం


