హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నగరాభివృద్ధికి సహకరించిన వారికి కృతజ్ఞతలు'

నెల్లూరు నగరంలో తొమ్మిది నెలల కాలంలో రూ. 334.59 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు మేయర్ దేవరకొండ సుజాత వెల్లడించారు. శనివారం జరిగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో 41 అజెండాలు, 3 టేబుల్ అజెండాలకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. నగరాభివృద్ధికి తోడ్పడిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి మేయర్ ధన్య వాదాలు తెలిపారు.