WG: తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు కట్టా నాగరాజు జనసేన పార్టీలో చేరారు. శనివారం ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. నాగరాజు మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై జనసేనలో చేరినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిగూడెంలో జనసేనలో చేరికలు


