హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హితచింతక్ అభియాన్ ప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలో హితచింతక్ అభియాన్‌ను భారత్ గ్యాస్ అధినేత బుర్ర ఆదినారాయణ శాస్త్రి శనివారం ప్రారంభించారు. హిందూ బంధువులందరూ హితచింతకులుగా నమోదు చేసుకోవాలని వీహెచ్పీ జిల్లా అధ్యక్షులు గొద్దు భాస్కరరావు పిలుపునిచ్చారు. హిందూ ధర్మం, సంస్కృతి పరిరక్షణ, సామాజిక సమరసతే ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం మధుసూదనరావు, సవర అనుపతిరావు పాల్గొన్నారు.