హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ జీవిత బీమా శిబిరాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నిర్మల్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. గొల్లపేటలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా శిబిరాన్ని తనిఖీ చేశారు. బీమా నమోదు తీరును పర్యవేక్షించారు. ఒక కుటుంబానికి బీమా నమోదు చేయడానికి ఎంత సమయం పడుతుందో స్వయంగా పరిశీలించారు.