హైదరాబాద్: 28°C
తెలంగాణ

13 మండలాల్లో విజయవంతంగా చెకుముకి పరీక్ష!

GDWL: జన విజ్ఞాన వేదిక, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ పరీక్ష విజయవంతమైంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని 13 మండలాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, కేజీబీవీలకు చెందిన 170 పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన కొంతమంది విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.