హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్తతో నిండిన డ్రైనేజీలు.. రోడ్డుపై మురుగు నీరు

SRD: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద డ్రైనేజీలు చెత్తతో నిండిపోయాయి. మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కమిషనర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.