హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

ప్రకాశం: బాలికల భద్రత, విద్య, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని న్యాయమూర్తి రూపశ్రీ అన్నారు. సురక్షిత్ బచ్‌పన్ అభియాన్, బాల్య వివాహ ముక్త్ భారత్ 100 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం కనిగిరిలోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రభుత్వ బాలికల సంక్షేమ పాఠశాలలో విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహ నిషేధ చట్టంపై అవగాహన కల్పించారు.