హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాదచారుల దారికి అడ్డంకులు తొలగింపు

MDCL: ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలకు చెక్ పెట్టేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. జేఎన్టీయూ సమీపంలోని కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 6లో ‘రైట్ టు వాక్’ కార్యక్రమంలో భాగంగా ఆక్రమణలను తొలగించారు. పాదచారుల రాకపోకలకు అడ్డంకిగా మారిన వ్యాపారాలను తొలగిస్తూ, ఫుట్‌పాత్‌లు నడిచేందుకే తప్ప వ్యాపారాలకు కాదని అధికారులు స్పష్టం చేశారు.