హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టిన బైక్

SRD: సంగారెడ్డి కొత్త బస్టాండ్ ఏరియాలోని కరుణ హైస్కూల్ వద్ద ఇవృ బాలమణి(50) రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కంది 108 సిబ్బంది EMT విజయ్, పైలట్ రంజిత్ క్షతగాత్రురాలికి ప్రథమ చికిత్స అందించి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.