హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్లాస్టింగ్‌తో రోడ్డుపై రాళ్లు.. నాలుగు కార్లు ఢీ!

RR: హిమాయత్ సాగర్ ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హెచ్‌ఎండీఏ రోడ్డు పనుల్లో భాగంగా చేపట్టిన బ్లాస్టింగ్‌తో రోడ్డుపై రాళ్లు చెల్లాచెదురుగా పడ్డాయి. వాటిని గమనించని వాహనదారులు ఒకదానికొకటి ఢీకొనడంతో నాలుగు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్డు పనుల వద్ద భద్రతా చర్యలు పటిష్ఠం చేయాలని వాహనదారులు కోరుతున్నారు.