హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

23న మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

CTR: పుంగనూరు పురపాలక నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈనెల 23న సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్, వార్డు సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు వెల్లడించారు. అనంతరం వైస్‌చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.