ELR: గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవాలకు హాజరుకావాలని జడ్పీ ఛైర్‌పర్సన్ నవ్యశ్రీని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు) ఆహ్వానించారు. ఈ మేరకు ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కార్తీక మాసోత్సవాలకు తప్పకుండా హాజరవుతానని ఆమె హామీ ఇచ్చినట్లు సత్యనారాయణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ ఉత్సవాలకు జడ్పీ ఛైర్‌పర్సన్‌కు పిలుపు


