హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.6 కోట్లతో పాత బజారు అభివృద్ధి: MLA

MBNR: జడ్చర్ల పాత బజారులోని 6, 7, 21, 22, 23 వార్డుల్లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పాత బజారు అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభించి మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.