హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్లు దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు

KMR: మద్నూర్ మండలంలోని పలు కల్లు దుకాణాల్లో శనివారం బిచ్కుంద ఆబ్కారీ సీఐ వినోద్ రాథోడ్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. కల్తీ, నిషేధిత మత్తు పదార్థాల కలపడంపై ఆరా తీస్తూ కల్లు నమూనాలు సేకరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణాల నిర్వాహకులను హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తనిఖీలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.