హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేల ఆరోగ్యమే రైతుల సంపద: AO

SDPT: తొగుట మండలం బండారుపల్లిలో కేత్ బచావో అభియాన్‌లో భాగంగా రైతులకు పంట వ్యర్థాల నిర్వహణపై MAO మోహన్ అవగాహన కల్పించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల నేలలో పోషకాలు తగ్గి పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు. పొలంలోనే కలియదున్నితే భూసారం పెరిగి దిగుబడులు 5 -10 శాతం పెరిగే అవకాశముందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్ స్వామి, AEO నాగార్జున పాల్గొన్నారు.