హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పదేళ్ల అవినీతిని ప్రజలు మరిచిపోరు'

NZB: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం వృథా చేశారని, బీఆర్ఎస్ హయాంలో భూదోపిడీ జరిగిందని విమర్శించారు.