హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనారిటీ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

SRCL: మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి గొట్టె జయశ్రీ తెలిపారు. ఈవీ, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్స్, డేటా అనలిటిక్స్, మెడికల్ కోడింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉన్నాయని అన్నారు.