SRPT: పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు అండర్ పాస్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వస్తున్న క్రేన్ అదుపుతప్పి వృద్ధుడిని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
క్రేన్ ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు


