హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు కలగొద్దు: పిఓ

MLG: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. శనివారం ఏటూరు నాగారం మండలం రొయ్యూరు జీసీసీ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. తేమ శాతం, టార్పాలిన్లు, గన్నీబ్యాగులు, మిల్లులకు రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. రైతులతో మాట్లాడి మద్దతు ధర, అదనపు బోనస్‌పై అవగాహన కల్పించారు.