NRPT: దామరగిద్ద మండలం లోకుర్తికి చెందిన గాయత్రి శుభకార్యానికి వేళ్తూ చేతి బ్యాగును పోగొట్టుకుంది. అందులో రెండు సెల్ఫోన్లు, బంగారు గొలుసు, నగదు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన ఎస్సై వెంకటేశ్వర్లు సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాగును గుర్తించారు. వస్తువులతో సహా బ్యాగును ఆమెకు తిరిగి అప్పగించడంతో గాయత్రి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
పోగొట్టుకున్న బ్యాగును బాధితురాలికి అప్పగించిన పోలీసులు


