ములుగు గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో సెయింట్ ఆంథోనీస్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. మ్యూజికల్ ఛైర్, రంగోలి, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో బహుమతులు సాధించారు. విజేతలకు గ్రంథాలయ ఛైర్మన్ భానోత్ రవిచంద్ర, మున్సిపల్ కమిషనర్ బహుమతులు అందించారు. చదువుతోపాటు కళలు, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
తెలంగాణ
గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థుల ప్రతిభ


