హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవిత బీమాతో కుటుంబాలకు ఆర్థిక భరోసా

SRCL: ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని VMWD మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. ఆయన స్వయంగా పథకంలో నమోదు చేసుకున్నారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి బీమా ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో నమోదు చేసుకోవాలని కోరారు.