హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీలకు సముచిత స్థానం కల్పించింది వైసీపీనే'

VZM: బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సముచిత ప్రాధాన్యం కల్పించింది వైసీపీనే అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు తెలిపారు. శనివారం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చిన్న శ్రీను చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం మాని ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు.