GDWL: రాజోలిలో చేనేత బీమా పథకాలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పథకాల అర్హతలు, నిబంధనలను అధికారుల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. నేతన్న భద్రత కింద అర్హులకు రూ.5 లక్షల సమూహ జీవిత బీమాతో పాటు పొదుపు, భరోసా, రుణమాఫీ పథకాలు అమలులో ఉన్నాయని తెలిపారు. అపోహలు నమ్మకుండా పథకాలను వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
'బీమా పథకాలపై అపోహలు నమ్మొద్దు'


