MDK: రామాయంపేట మండలం దంతేపల్లిలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో సర్పంచ్ మస్కూరి బాలరాజు రైతుల సమస్యలను ప్రస్తావించారు. గతంలో అధికారుల సూచన మేరకు జొన్నలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వం పరిమితంగా కొనుగోలు చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. జొన్నలన్నింటినీ కొనుగోలు చేసేలా ఎలాంటి పరిమితులు విధించవద్దని అధికారులను కోరారు.
తెలంగాణ
VIDEO: జొన్నల కొనుగోళ్లలో పరిమితులు వద్దు: సర్పంచ్


