హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

VKB: కొడంగల్ పట్టణంలోని మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కైశిక ద్వాదశి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో బాలాలయంలో శనివారం ఉదయం తోమాల సేవ, అర్చన, కైశిక ద్వాదశి ఆస్థానం, ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు ద్వాదశి పురాణ విశిష్టతను భక్తులకు వివరించారు.