VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో వీధి దీపాలు 24 గంటల పాటు వెలుగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పగలు కూడా లైట్లు ఆన్‌లో ఉండటంతో విద్యుత్ వృథా అవుతోందని, ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోందని మండిపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలకు స్విచ్‌లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
పగలు కూడా వెలుగుతున్న వీధి దీపాలు


