కృష్ణా: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. మల్లాయపాలెం మాజీ ఎంపీటీసీ ముత్తా సత్యనారాయణ, నందివాడ మండలం పుట్టగుంట మాజీ సర్పంచ్ తెన్నేరు భాస్కరరెడ్డి తమ అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చేపడుతున్న గుడివాడ అభివృద్ధిని చూసి, అందులో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన వైసీపీ నేతలు


