MBNR: బాలానగర్ మండలం గౌతాపూర్లో దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 50కి పైగా టిప్పర్లను అడ్డుకుని నిరసన తెలిపారు. కల్వర్టు పనులు పూర్తికాకపోవడంతో దుమ్ము కారణంగా శ్వాసకోశ సమస్యలు, ప్రమాదాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు రోజూ ఉదయం, సాయంత్రం రోడ్డుపై నీళ్లు చల్లాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
గ్రామస్తుల నిరసన.. 50 టిప్పర్లు అడ్డగింత


