MNCL: మంచిర్యాలలో శనివారం వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు ఎర్రోళ్ల మల్లయ్య జెండాను ఎగరవేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బోడెంకి మహేష్ మాట్లాడుతూ.. మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి షరతులు లేకుండా నూరు శాతం సబ్సిడీతో రూ.5 లక్షల రుణం మంజూరు చేయాలని కోరారు.
తెలంగాణ
ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం


