అన్నమయ్య: రాజంపేట పాత బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి రసూల్ బీ (65) బస్సు వెనుక టైరు కింద పడిపోయారు. ఈ ఘటనలో ఆమె ఎడమ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. పెనగలూరు మండలం బుడ్డరెడ్డిగారిపల్లెకు చెందిన రసూల్ బీ కడప వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. మహిళకు గాయాలు


