హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు కార్పొరేషన్ చివరి సమావేశం

నెల్లూరు నగరపాలక సంస్థ పాలకవర్గం చివరి సాధారణ సమావేశం శనివారం జరిగింది. రాజకీయాల్లో వీడ్కోలు ఉండదని, మాజీ కార్పొరేటర్లకూ ప్రజాసేవలో సమాన పాత్ర ఉంటుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత పార్టీలకతీతంగా సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని సూచించారు. ఐదేళ్ల సహకారానికి మేయర్ రూప్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.