హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమగ్రాభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి'

శ్రీకాకుళం నగరపాలక సంస్థలో 16 ఏళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే శంకర్ శనివారం అన్నారు. గత పాలకుల హయాంలో కోర్టు కేసుల కారణంగా కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా అడ్డంకులు ఏర్పడ్డాయని విమర్శించారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.