హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

అనకాపల్లి ఎస్పీ కార్యాలయం సమీపంలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ విజయకృష్ణన్ ఇవాళ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సీసీ కెమెరాల పనితీరు, ప్రధాన ద్వారం సీళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రత విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందులో డీఆర్వో సత్యనారాయణ రావు, ఆర్డీవో శ్రీనివాసరావు, పార్టీల నేతలు పాల్గొన్నారు.