ATP: ఓ యువతితో రహస్యంగా చాటింగ్ చేస్తున్నాడని భార్య మందలించడంతో శ్రీను అనే వ్యక్తి ఇంట్లోంచి వెళ్లిపోయిన ఘటన అనంతపురంలో జరిగింది. రెండేళ్ల క్రితం వివాహమైన శ్రీను, ఈనెల 14న తన భార్య సెల్‌ఫోన్‌లో ఆ యువతితో చాటింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరగ్గా, భార్య ఫోన్‌తో సహా శ్రీను పరారయ్యాడు. అనంతపురం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రహస్య చాటింగ్.. భర్త అదృశ్యం


