హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలకుర్తిలో ఘనంగా మత్స్యకారుల దినోత్సవం

JN: పాలకుర్తిలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం నేతలు జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని, ముదిరాజ్ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించాలన్నారు. మత్స్యకారులకు పింఛన్లు, ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.