హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాట్‌పుట్‌లో సత్తాచాటిన యానంబైలు విద్యార్థి

BDK: జిల్లా స్థాయి 70వ పాఠశాలల క్రీడా పోటీల్లో పాల్వంచ మండలం యానంబైలు జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి బి. చరణ్ ప్రతిభ చాటాడు. షాట్‌పుట్ పోటీలో అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల హెచ్‌ఎం బి. ప్రకాశ్ రావు, పీడీ వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ సుప్రియ, ఉపాధ్యాయులు చరణ్‌ను అభినందించారు.