హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీమా పథకం దరఖాస్తులను పరిశీలించిన ఎమ్మెల్యే

ADB : ఉట్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకం దరఖాస్తుల ప్రక్రియను నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తుల నమోదు ప్రక్రియను, లబ్ధిదారుల వివరాలను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.