హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చైన్ స్నాచింగ్.. ఇద్దరి అరెస్ట్

VZM: జామిలో మహిళ మెడలో 4 తులాల నెక్లెస్‌ను అపహరించిన ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కుమరం గ్రామంలో గృహప్రవేశానికి వెళ్లి తిరిగి వస్తున్న రాకోడుకు చెందిన రమణమ్మను రోడ్డుపై నెట్టి నెక్లెస్ దోచుకెళ్లారు. ఈ కేసులో హరికృష్ణ, శివగణేష్‌ను అరెస్ట్ చేసి, మరో కేసులో చోరీ చేసిన 2 తులాల గొలుసు, బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.