హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 23న శూలాల మహోత్సవం

AKP: మునగపాకలో ఈ నెల 23న సోమవారం శ్రీ సాంబమూర్తి శూలాల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవ పోస్టర్‌ను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ నేడు కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. సోమవారం వేకువజామున అభిషేకాలు, రాత్రికి విద్యుత్ దీపాలంకరణతో శూలాల ఊరేగింపు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కమిటీ కోరింది.