PDPL: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు ప్రతిఒక్కరూ సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రామగుండంలోని సిమ్స్ గుడ్ విల్ ఫౌండేషన్ సహకారంతో సుమారు 1000 మంది విద్యార్థులు, పోలీసు సిబ్బందికి డాక్టర్ శివరంజని సంతోష్ సీపీఆర్ శిక్షణ ఇచ్చారు. ఆకస్మిక గుండెపోటు సమయంలో వైద్య సహాయం అందేలోపు సీపీఆర్ చేయడం కీలకమని సీపీ పేర్కొన్నారు.
తెలంగాణ
సీపీఆర్‌పై అవగాహన అవసరం: సీపీ


