హైదరాబాద్: 28°C
తెలంగాణ

PACS జాబితాలో గట్టుఇప్పలపల్లికి మొండిచేయి

RR: తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 240 నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) జాబితాలో చేర్చకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో రెండో అతిపెద్ద గ్రామమైన గట్టుఇప్పలపల్లికి PACS ఏర్పాటు చేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలను కోరారు. స్పందించకపోతే గ్రామస్తులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.