JGL: రాయికల్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం సైన్స్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు.ఇందులో భాగంగా మండల స్థాయి పరీక్షలు నిర్వహించగా, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, తార్కికత విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు.
తెలంగాణ
రాయికల్లో చెకుముకి సైన్స్ సంబరాలు


