VZM: స్దానిక 60వ డివిజన్ గాజులరేగ సర్వే నంబర్ 70-1లోని 1.54 ఎకరాల ప్రభుత్వ, దళితుల భూముల్లో అక్రమ నిర్మాణాలు, వైన్ షాపు ఏర్పాటును నిరసిస్తూ శనివారం దళిత సంఘాల నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. దీనిపై కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. కమిషనర్ స్పందించి అక్రమ కట్టడాలపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ నిర్మాణాలు తొలగించాలని నిరసన


