KRNL: నందవరంలోని వెలుగు కార్యాలయంలో శనివారం సర్పంచ్ ఎన్నికల విధులపై పీఓలకు శిక్షణ నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీవో సందీప్, ఏవో కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ట్రైనర్ రాఘవన్ ఎన్నికల నియమావళి, నామినేషన్ల స్వీకరణ, ఓటింగ్ ప్రక్రియ, బ్యాలెట్ బాక్సుల నిర్వహణపై అవగాహన కల్పించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండి పొరపాట్లకు తావివ్వకూడదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పీఓలకు ఎన్నికల విధులపై శిక్షణ


