హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మ సన్నిధిలో చింతమనేని కుటుంబం

ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ చింతమనేని సాయి నవ్యశ్రీ పృథ్వీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వంకినేని భాను ప్రకాష్ కుటుంబ సమేతంగా శనివారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ముందుగా ద్వారకాతిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించారు.