KRNL: ఆదోని 48వ వార్డు భవాజీపేటకు చెందిన కుంటి నాగేంద్ర ఇవాళ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కౌన్సిలర్ తిమ్మప్ప వాల్మీకి వారి కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5,000 ఆర్థిక సాయం అందించారు. గత ఎన్నికల్లో నాగేంద్ర మరో పార్టీకి మద్దతుగా పనిచేసినా రాజకీయ విభేదాలను పక్కనపెట్టి కుటుంబానికి అండగా నిలిచారు. ఆయన సేవాభావాన్ని స్థానికులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాజకీయాలకు అతీతంగా మానవత్వం చాటుకున్న కౌన్సిలర్


