హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్ద దర్గాను దర్శించుకున్న దర్శకుడు వేణు

కడప నగరంలోని ప్రసిద్ధ ప్రాచీన అమీన్ పీర్ పెద్ద దర్గాను ప్రముఖ దర్శకుడు, హాస్యనటుడు వేణు సందర్శించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దర్గా చరిత్ర, విశిష్టత, ప్రాధాన్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు వేణుకు ఘన స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు.